Spirit: ఒక్క లైక్‌.. ‘స్పిరిట్‌’ వివాదంపై దీపికా స్పందనిదే


ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో రానున్న చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit). ఈ సినిమా నుంచి దీపికా పదుకొణె వైదొలగడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా సందీప్‌ సోదరుడు ప్రణయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె ప్రాజెక్ట్‌ను నుంచి వెళ్లిపోవడానికి కారణాన్ని పంచుకోవడంతో ఈ విషయం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

దీపిక (Deepika Padukone) ఈ సినిమా నుంచి వైదొలగడానికి కారణాన్ని ప్రణయ్‌ వివరించారు. తన డేట్స్‌ సర్దుబాటు చేయడంతో పాటు దీపిక భారీ పారితోషికం అడిగారని చెప్పారు. అలాగే సినిమా లాభాల్లో 10 శాతం వాటా అడిగారని తెలిపారు. ఈ కామెంట్స్‌ ఒక్క రోజుల్లోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాయి. తాజాగా దీనిపై ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌కు దీపిక లైక్‌ చేసి తన స్పందనను పరోక్షంగా తెలిపారు. ‘‘ఒక మహిళ ఇలాంటి డిమాండ్‌లు చేస్తే సహించలేకపోతున్నారు. ఆమె నో చెప్పడం వల్ల ఈగో సమస్యలు వచ్చాయి. ఇది కేవలం పురుషాధిక్య అహంకార సమస్య మాత్రమే’’ అని ఇన్‌స్టాలో ఒకరు పెట్టిన పోస్ట్‌కు దీపిక లైక్‌ చేయడం ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ‘స్పిరిట్‌’ (Spirit)లో మొదట దీపికను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం దర్శకుడు సందీప్‌ ఆమెతో ఏడాదిన్నర వర్క్‌ చేశారు. అయితే ఆ తర్వాత దీపిక స్థానంలోకి త్రిప్తి దిమ్రీని తీసుకున్నారు. ఆ సమయంలో దీపిక ఈ కథను లీక్‌ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.



Source link

Scroll to Top