This week telugu movies: ఈ వారం థియేటర్‌లో యాక్షన్‌.. ఓటీటీలో వినోదం


అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘బ్లాస్ట్‌ జోన్‌’ (Blast Zone Movie). సుభాష్‌ కె.రాజ్‌ దర్శకత్వం వహించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 28న (blast movie arjun) థియేటర్లలో విడుదల కానుంది. అనుకోని పరిస్థితుల్లో ఓ హెడ్‌మాస్టర్‌ ఫ్యామిలీ ఆపదలో పడుతుంది. అయితే, కరాటే తెలిసిన ఆ కుటుంబం తమని తాము ఎలా రక్షించుకున్నది అన్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు  ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.


‘మరీచిక’ సినిమాతో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు అనుపమ పరమేశ్వరన్, రెజీనా. వీళ్లిద్దరూ… విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని సతీశ్‌ కాశెట్టి తెరకెక్కించారు. రాజీవ్‌ చిలక, మేఘా చిలక నిర్మించారు. అజయ్‌ ఘోష్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. వెంకట లక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి, సంజు అనే సిటీ కుర్రాడి మధ్య బంధం బలపడుతుండగా.. మరీచిక అనే ఎన్నారై రావడంతో  ఆ ముగ్గురి జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలేంటనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దారు.


ఓటీటీలోనూ వినోదమే.. సినిమాలు/వెబ్‌సిరీస్‌లివే!

కమెడియన్‌ సత్య హీరోగా దర్శకుడు రితేశ్‌ రానా తెరకెక్కించిన చిత్రం ‘జెట్లీ’ (Jetlee). వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వైవా హర్ష, అజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రియా సింఘా కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం ‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar) వేదికగా వినోదాన్ని పంచుతోంది.


ధనుష్‌, మమితాబైజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కర’ (Kara Movie). యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కె.ఎస్‌.రవికుమార్‌, పృథ్వీరాజన్‌ కీలక పాత్రల్లో కనిపించారు.

  • జియో హాట్‌స్టార్‌
  • బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) తమిళ్‌ మే 27
  • నెట్‌ఫ్లిక్స్‌
  • షరీఫ్‌ లాబర్డర్‌ (మూవీ) ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది
  • మై2 సెంట్స్‌ (మూవీ ఇంగ్లీష్‌ మే 27
  • రఫా: సీజన్‌1 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ మే 29
  • అమెజాన్‌ప్రైమ్‌ వీడియో
  • స్పైడర్‌ నోయిర్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ మే 27
  • లీడర్‌ (మూవీ) తెలుగు/తమిళ్‌ మే 29
  • మనోరమా మ్యాక్స్‌
  • స్పా (మూవీ)మలయాళం మే 28
  • సన్‌నెక్ట్స్‌
  • ఫేసెస్‌ (మూవీ) మలయాళం/తెలుగు మే 29



Source link

Scroll to Top