This Week OTT Release: ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఈ బ్లాక్‌బస్టర్స్‌ అస్సలు మిస్సవ్వద్దు


korean kanakaraju ott || బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న కామెడీ హారర్‌ థ్రిల్లర్‌ ‘కొరియన్‌ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా నటించారు. రితికా నాయక్‌ కథానాయిక. సత్య కీలక పాత్ర పోషించారు. థియేటర్‌లో అలరించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 4వ (korean kanakaraju ott release date) తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. (పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)


DC Movie Ott || లోకేశ్‌ కనగరాజ్‌, వామికా గబ్బి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘డీసీ’ (DC). థియేటర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబరు 4వ తేదీ నుంచి సన్‌నెక్ట్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. (పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)


Pallaburusu OTT || సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం పళ్ళబురుసు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలంగాణ గ్రామీణ కథగా రూపొందింది. (పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)


GDN Movie OTT || మాధవన్‌ కీలక పాత్రలో కృష్ణ‌కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జి.డి.నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో (GDN movie) దుషారా విజ‌య‌న్‌, ప్రియ‌మ‌ణి, జ‌య‌రామ్‌, స‌త్య‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించారు. (పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)


Dhamaal 4 OTT అజయ్‌ దేవగణ్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్, అర్షద్‌ వార్సీ, సంజయ్‌ మిశ్రా, జావేద్‌ జాఫ్రీ కీలక పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ధమాల్‌ 4’(Dhamaal 4). ఇంద్రకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్‌ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.


Unmadham OTT || ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్‌ పంచడానికి మరో మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిద్ధమైంది. కుంచకో బోబన్‌, లిజోమోల్‌ జోసే, రైనా రాధాకృష్ణన్‌, సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉన్మాదం’ (Unmadham). గత నెలలో మలయాళంలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు థ్రిల్‌ పంచింది. ఇప్పుడు సెప్టెంబరు 4వ (unmadham ott release date) తేదీ నుంచి సోనీలివ్‌ వేదికగా అందుబాటులోకి రానుంది.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌

  • అమెజాన్ ప్రైమ్‌ వీడియో
  • ది రన్నర్‌ (మూవీ) ఇంగ్లీష్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • జగమే సంగీతం (వెబ్‌సిరీస్) తెలుగు సెప్టెంబరు 4
  • నెట్‌ఫ్లిక్స్‌
  • టర్నింగ్‌ పాయింట్‌: జనరేషన్‌ 9/11 (మూవీ) ఇంగ్లీష్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • లవ్‌ సిక్‌ (మూవీ) స్పానిష్‌/ఇంగ్లీష్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • వదలా (మూవీ) తెలుగు స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • గాంధారి (మూవీ) హిందీ స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ది జెంటిల్‌మెన్‌: సీజన్‌2 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ది ప్రెసిడెంట్స్‌ కేక్‌ (మూవీ) ఇంగ్లీష్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ఎర్లీ మీట్స్‌ వరల్డ్ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ సెప్టెంబరు 4
  • ఎ మినిక్రాఫ్ట్‌ మూవీ (మూవీ) ఇంగ్లీష్‌ సెప్టెంబరు 4
  • ది బ్రెడ్‌ విన్నర్‌ (మూవీ) ఇంగ్లీష్‌ సెప్టెంబరు 6
  • జియో హాట్‌స్టార్‌
  • స్టార్‌ వార్స్‌: ది మాండలోరియన్‌ అండ్‌ గ్రోగ్‌ (మూవీ) ఇంగ్లీష్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ది కోర్ట్‌ (వీక్లీ సిరీస్‌) తమిళ్‌ సెప్టెంబరు 4
  • జీ5
  • వీరభద్ర రహస్యం (సీజన్‌1: పార్ట్‌2) తెలుగు సెప్టెంబరు 4
  • మనోరమా మ్యాక్స్‌
  • అనంతన్‌ కాడు (మలయాళం) స్ట్రీమింగ్‌ అవుతోంది.



Source link

Scroll to Top