Tamil Nadu: ‘మధుమిత రీల్స్‌ చూసే చోరీ చేశాం’


నిందితుడి వాంగ్మూలం

ప్యారిస్, న్యూస్‌టుడే: యూట్యూబర్‌ మధుమిత ఇన్‌స్టా రీల్స్‌ చూసే ఆమె ఇంట్లో చోరీ చేసినట్లు అరెస్టయిన యువకుడు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. కన్నియాకుమరి జిల్లా నాగర్‌కోవిల్‌కి చెందిన వినోద్‌కుమార్‌ పారిశ్రామికవేత్త. ఆయన భార్య మధుమిత ప్రముఖ యూట్యూబర్‌. ఆమె ఒంటినిండా బంగారు నగలను అలంకరించుకుని, డబ్బు కట్టలు ముందేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ పేరొందింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో ఈ నెల 24వ తేదీ 118 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. రాజాక్కమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠంకి చెందిన నిందితుడు ఇసక్కిపాండి అనే యువకుడిని అరెస్టు చేశారు. దర్యాప్తులో.. మధుమిత రీల్స్‌ చూసే చోరీకి పాల్పడినట్లు అతను పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు.



Source link

Scroll to Top