Radhika Sarathkumar praises Ajith kumar: అజిత్‌పై రాధిక ప్రశంసలు.. త్రిషతో సెల్ఫీ వైరల్


ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్ కథానాయకుడు అజిత్ కుమార్ (Ajith Kumar) మరోసారి కారు రేసింగ్‌లో పోటీపడేందుకు సిద్ధమయ్యారు. లండన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరగనున్న ‘మిచెలిన్ లే మాన్స్ కప్’లో ఆయన పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ (Radhika Sarathkumar) లండన్‌లో అజిత్‌ను కలిశారు. రేసింగ్ పట్ల ఆయనకున్న ఇష్టాన్ని, పట్టుదలను ప్రశంసించారు. ఈ సందర్భంగా అజిత్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ఆయన ఎప్పుడూ ఎంతో వినయంగా, అందరికీ ఆదర్శంగా ఉంటారని రాసుకొచ్చారు.

మరోవైపు, ప్రస్తుతం ఓ మలయాళ సినిమా షూటింగ్ కోసం లండన్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)ను కూడా ఆమె కలిశారు. ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీని షేర్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది.  

సెప్టెంబర్ 11, 12 తేదీల్లో సిల్వర్‌స్టోన్ రౌండ్ జరగనుండగా.. 12న ప్రధాన రేస్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అజిత్ పోటీపడే ఈ రేస్‌ను విజయ్ ప్రారంభించనున్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ ఇద్దరు అగ్ర నటులు.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పాలుపంచుకోనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.



Source link

Scroll to Top