OnePlus 15R: బిగ్‌ బ్యాటరీతో వన్‌ప్లస్‌ 15R.. ధర, ఫీచర్లు ఇవే


OnePlus 15R | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (Oneplus) మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 15 సిరీస్‌లో వన్‌ప్లస్‌ 15కు కొనసాగింపుగా 15Rను లాంచ్‌ చేసింది. ఫ్లాగ్‌షిప్‌ క్వాలిటీ, ప్రీమియం ఫీచర్లతో బిగ్‌బ్యాటరీతో మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్లో ఈ ఫోన్‌లను కంపెనీ విడుదల చేసింది. వీటి ధర, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

వన్‌ప్లస్‌ 15Rను స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 5 చిప్‌సెట్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 16తో పనిచేస్తుంది. ఇందులో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్‌ స్క్రీన్‌ ఇచ్చారు. ఇది 165Hz రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్‌ చేస్తుంది. 3200 టచ్‌ శాంప్లింగ్‌ రేటు, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.

ఇందులో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌906 ప్రధాన సెన్సర్‌ను అమర్చారు. 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. ముందు వైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఇందులో 7,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. వన్‌ప్లస్‌ ఫోన్లలో ఇప్పటి వరకు ఇదే పెద్ద బ్యాటరీ. ఇది 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బైపాస్‌, రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

ధర విషయానికి వస్తే.. 12GB+256GB వేరియంట్‌ బేస్‌ మోడల్‌ ధరను రూ.47,999గా నిర్ణయించారు. ఇందులో 512GB ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ ధరను రూ. 52,999గా నిర్ణయించారు. ఈరోజు ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. వచ్చే వారం అందుబాటులోకి రానున్నాయి. యాక్సెస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై డిస్కౌంట్‌తో బేస్‌ మోడల్‌ రూ.44,999కు, 512GB స్టోరీజీ వేరియంట్‌ రూ.47,999కు రానుంది. 



Source link

Scroll to Top