* బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ కలెక్షన్ల సునామీ… రీ రిలీజ్లోనూ ప్రభాస్ రికార్డుల వేట!
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అప్డేట్ ఏమిటంటే.. మే 1వ తేదీన ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. గోపీచంద్ మలినేని సినిమా సెట్స్‌పై ఉండగానే, బాలయ్య ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కొరటాల ప్రాజెక్టును లైన్లో పెట్టడం విశేషం. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.
* ‘ఉస్తాద్’పై పరుచూరి పంచ్‌లు.. పవన్ సినిమా ఎక్కడ తప్పటడుగు వేసిందంటే?
రచయితగా ‘భద్ర’, ‘సింహా’ వంటి చిత్రాలకు పనిచేసిన అనుభవం, దర్శకుడిగా ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, వంటి వరుస ₹100 కోట్ల క్లబ్ సినిమాల రికార్డు కొరటాల శివ సొంతం. ‘దేవర: పార్ట్ 1’తో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఆయన హీరో పాత్రలను అత్యంత పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేస్తూనే సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తారు. ఇప్పుడు బాలయ్య మార్క్ ఊరమాస్ యాక్షన్‌కు, కొరటాల శైలి మేకింగ్ తోడైతే వెండితెరపై రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వివేక్ ఆత్రేయ వంటి యువ దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి బాలయ్య కొరటాల శివ చెప్పిన పవర్ఫుల్ స్క్రిప్ట్‌కే మొగ్గు చూపారు.
* శ్రీలీల బాలీవుడ్ కలలకు బ్రేక్?… షాకింగ్ విషయం చెప్పిన డైరెక్టర్ అనురాగ్ బసు
ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ ప్రారంభించడానికి ముందు దొరికిన గ్యాప్‌లో ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్నది చిత్ర బృందం లక్ష్యం. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సీనియర్ నటి ప్రియమణిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి గతంలో ‘మిత్రుడు’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. ఇక బాలయ్య మార్క్ సంక్రాంతి సెంటిమెంట్ ఈసారి కొరటాల డైరెక్షన్లో మళ్ళీ రిపీట్ అవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మెగా కొలాబరేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.



