
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆయన నటించిన తాజా హారర్-కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) .. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రీమియర్లతో కలిపి తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది (Korean Kanakaraju First Day Collections). వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ఇది.
ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కేవలం భయపెట్టడమే కాకుండా, కడుపుబ్బా నవ్వించేలా కథనం సాగడమే ఈ సినిమా ప్రధాన బలం. మరోవైపు ఉత్తర అమెరికాలోనూ ఇప్పటికే.. 175 వేల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది.


