IPL: క్వాలిఫయర్‌ 1 నుంచి ఫైనల్‌ ‘ఫైర్‌’ వరకు… ఐపీఎల్‌


ఐపీఎల్‌ 2026లో లీగ్‌ దశ ముగిసింది. ఇక ఈ సీజన్‌లో విజేత ఎవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మంగళవారం నుంచి ప్లేఆఫ్స్‌ ప్రారంభం కానున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌.. ఈ నాలుగు జట్లూ ప్లేఆఫ్స్‌ ఆడనున్నాయనే విషయం తెలిసిందే.

  • ఇందులోభాగంగా మంగళవారం ధర్మశాల వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య క్వాలిఫయర్‌- 1 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లనుంది. 
  • బుధవారం ముల్లాన్‌పుర్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. ఓడిన టీమ్‌ ఇంటి ముఖం పడుతుంది. 

  • శుక్రవారం ముల్లాన్‌పుర్‌ వేదికగానే క్వాలిఫయర్‌-2 జరగనుంది. క్వాలిఫయర్‌- 1లో ఓడిన జట్టు.. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఓడిన జట్టు నిష్క్రమించనుంది.
  • ఐపీఎల్‌ ఫైనల్‌ ఆదివారం.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. క్వాలిఫయర్‌-1లో నెగ్గిన జట్టు, క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు తుదిపోరులో పోటీ పడతాయి. ఇందులో నెగ్గిన జట్టు విజేతగా నిలిచి ఐపీఎల్‌ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంటుంది. 
  • ప్రస్తుతం ప్లేఆఫ్స్‌నకు చేరుకున్న నాలుగు జట్లూ మేటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. 
  • ఈ జట్లు బలాబలాల్లో సమతూకంగా ఉన్నాయి. 
  • ఈ సీజన్‌లో ఇప్పటివరకు 70 మ్యాచ్‌లు జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు.. ఇకముందు జరగాల్సిన 4 మ్యాచులు మరో ఎత్తు.
  • ప్రేక్షకుల వీక్షణల్లోనూ ఈ మ్యాచ్‌లు కొత్త రికార్డులు సృష్టించే అవకాశముంది. 
  • దీంతో మంగళవారం నుంచి జరగనున్న మ్యాచ్‌లు హోరాహోరీ పోరుతో మరింత హీట్‌ పెంచనున్నాయి.


– ఇంటర్నెట్‌ డెస్క్‌ 



Source link

Scroll to Top