Illu Illalu Pillalu July 02nd Episode: వద్దు ప్రేమా వద్దు.. నా చావు నేను చస్తా కానీ.. నువ్వు పనికిమాలిన పనులు చేసి నా కొంపలో కుంపటి పెట్టకు. మరోసారి మా నాన్న చొక్కా చింపేసే పని చేయకు అని ధీరజ్ మొత్తుకుంటూనే ఉన్నాడు. అబ్బే ప్రేమ వినిపించుకుంటుందా? పొడుస్తా.. గిడుస్తానంటూ బయల్దేరి బొక్కబోర్లాపడింది. ఈరోజు (జూలై 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే..

నిజం చెప్పేసిన డాక్టర్.. వాళ్ల అమ్మే ఇదంతా చేయించింది..
దాంతో డాక్టర్ దారిలోకి వస్తుంది. “తన కూతురి కాపురం నిలబెట్టమని వల్లివాళ్ల అమ్మ, నాన్న నా కాళ్లు పట్టుకున్నారు. అందుకే వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. ఆరోజు వల్లిని మీరు చెకప్ తీసుకువచ్చిన రోజు కూడా తనకు చావే గతి అని కాళ్లు పట్టుకుని ఏడిస్తే జాలిపడి ఈ రిపోర్ట్స్ ఇచ్చాను” అంటూ అసలు విషయం చెబుతుంది డాక్టర్. “మీరు ఇచ్చిన ఈ రిపోర్ట్స్ పట్టుకుని తను ప్రెగ్నెంట్ అని అందరిని నమ్మించి పిచ్చోళ్లను చేసింది. ఈరోజు ఏకంగా తనకు అబార్షన్ అయ్యిందని డ్రామాలు ఆడింది. తనకు అబార్షన్ కావడానికి నేనే కారణమని అందరి ముందు నా మీద నిందలు వేసింది.
పదా వల్లీ ప్రెగ్నెంట్ డ్రామా అందరి ముందు బయటపెట్టూ.. లేదంటే!!
వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి మీరు నా కుటుంబాన్ని మోసం చేశారు. మా అత్తగారింటి వాళ్లు నన్ను ద్వేషించడానికి కారణమయ్యారు. పదండి. వల్లి ప్రెగ్నెంట్ డ్రామా గురించి మా ఇంట్లో వాళ్లకు చెబుదురు పదండి” “అంటుంది నర్మద సీరియస్ గా. “ప్లీజ్.. ఈ విషయంలోకి నన్ను లాగొద్దు.. నా పేరు, హాస్పిటల్ రెప్యూటేషన్ అన్ని దెబ్బతింటాయి. ప్లీజ్ ” అంటూ రిక్వెస్ట్ చేస్తుంది డాక్టర్. “అంటే మీరు చెప్పిన అబద్దాల వలన నేను నిందలు పడిన… నా కుటుంబం మోసపోయినా మిమ్మల్ని వదిలేయాలా.. ఆ వల్లి ఇంకా ఇంకా అబద్దాలు, నాటకాలు ఆడటానికి అవకాశం ఇవ్వాలా ” అంటుంది నర్మద కోపంగా.
దయచేసి నన్ను వదిలేయండి.. ‘నిన్ను కాదు దాన్ని బయటకు లాక్కొస్తా’
“చూడండి. సాటి ఆడపిల్ల అని జాలిపడి తన కాపురం నిలబెట్టడం కోసమే అబద్ధం చెప్పాను. అంతేతప్ప ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదు.అంతేకాదు.. ఇంకోసారి నా హాస్పిటల్ సైడ్ రావొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాను. అంతపెద్ద మోసం చేసిన ఆ డాక్టర్ ను వదిలేసి.. కాపురం నిలబెట్టిన నన్ను న్యాయం కోసం ఇబ్బందుల్లో పడేయడం న్యాయమా చెప్పండి” అని అడుగుతుంది డాక్టర్. దీంతో ప్రెగ్నెంట్ పోయిందని చెప్పిన డాక్టర్ మాటలు గుర్తు చేసుకుంటుంది నర్మద. “పట్టుకోస్తా.. అబార్షన్ అని అబద్ధం చెప్పిన ఆ డాక్టర్ నే.. జుట్టు పట్టుకుని లాక్కొస్తా” అంటూ వెళ్లిపోతుంది నర్మద.
ముందు రిహార్సల్స్ చేద్దామా? ఓరి కామాంధుడా.. ఆ చూపేంట్రా బాబూ
మరోవైపు డ్యాన్స్ కాంపీటీషన్ కోసం రెడీ అవుతూ ఉంటుంది ప్రేమ. “ధీరజ్.. ఫస్ట్ టైమ్ ఒక గ్రాండ్ డ్యాన్స్ షో చేస్తున్నాను రా. నువ్వు నా పక్కన ఉంటే నువ్వు చూస్తే.. అది నాకు గొప్ప గిఫ్ట్ తోపాటు చాలా మెమొరబుల్ అయ్యి ఉండేది. కానీ నా బ్యాడ్ లక్. నాకు ఆ అదృష్టం లేదు” అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ప్రేమ డోర్ కొట్టిన సౌండ్ రావడంతో ఎవరు అని అడుగుతుంది ప్రేమ. “నేనే రాజపుష్పంను” అంటాడు అవతలి నుంచి రాజపుష్పం. వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది ప్రేమ. “డ్యాన్స్ కాంపీటీషన్ స్టార్ట్ అయ్యిందా సర్.. నేను వచ్చేయానా” అని అడుగుతుంది ప్రేమ. “ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే స్టార్ట్ చేయాలి ” అంటాడు రాజపుష్పం.
ప్రేమపై అఘాయిత్యం.. ఏయ్ వదలరా.. వదులూ
“సర్.. నేను త్వరగా మా ఊరు వెళ్లిపోవాలి. అందుకని డ్యాన్స్ షో త్వరగా స్టార్ట్ చేయండి సర్” అంటుంది ప్రేమ. “వెళ్లిపోతావా.. ఎప్పుడెప్పుడు షో స్టార్ట్ చేద్దా మా అని నేను కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను. అంతకంటే ముందు రిహార్సల్స్ స్టార్ట్ చేద్దామా” అంటూ ప్రేమ దగ్గర దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుంటాడు రాజపుష్పం. “వదులు వదలు ” అంటూ రాజపుష్పంను విడిపించుకుంటుంది రాజపుష్పం. “వావ్..కన్నులేమో వెలిగినే.. అధరాలు అదిరేనే.. ఈ అందానికి నా మది చెదిరేనే.. ఈ అందానికి నాలోని మన్మథుడు తలవంచేనే..” అంటాడు రాజపుష్పం.
నువ్వు మాటలతో వినవే.. ఎక్కడికిపోతావే
“ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు” అంటుంది ప్రేమ. “పిచ్చి పిచ్చిగా కాదు. నీ అందానికి దాసుడిని అయ్యాను. అందుకే నిన్ను ఇక్కడకు రప్పించాను. నీ అందంతో నా మనసును మైమరపించేలా చేశావు” అంటూ ప్రేమ చేతిని పట్టుకుంటాడు రాజపుష్పం. దీంతో రాజపుష్పంను లాగిపెట్టి కొడుతుంది ప్రేమ. ” చంపేస్తాను. తిక్క తిక్క వేశాలు వేసావంటే చంపేస్తాను. అయినా.. ఇందకటి నుంచి నువ్వు తిక్క తిక్కగా మాట్లాడుతుంటే నీ బిహేవియర్ నాకు అర్థం కాలేదు రా. ఇదా నీ ఒరిజినల్ క్యారెక్టర్. నడవరా… మర్యాదగా బయటకు నడువు” అంటూ వార్నింగ్ ఇస్తుంది ప్రేమ.
నాలోని రాక్షసుడ్ని బయటకు తీయొద్దూ..
” నా మనసుకు నచ్చిన అందాన్ని నా సొంతం అవకుండా వదిలిపెట్టను. అలాంటిది నిన్నేల వదిలిపెడతాను అనుకుంటున్నావు ” అంటూ ప్రేమ చేతిని పట్టుకుని బలవంతం చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు రాజపుష్పం. ” నువ్వు డ్యాన్స్ కాంపీటీషన్ లో గెలిచి పది లక్షలు పట్టుకెళ్లాలి అంటే కళ్లు సిగ్గుపడాలి తప్ప నోరు మాట్లాడకూడదు. నాలో రొమాంటిక్ కింగే కాదు.. రాక్షసుడు కూడా ఉన్నాడు. మాటలతో వింటావు అనుకున్నాను. కానీ పులిలా ఎదురుతిరుగుతుంటే ఏం చేస్తాం. కోరలు పీకి దారిలోకి తెచ్చుకుంటాం. ఎక్కడికి పోతావే చిన్నదానా” అంటూ ప్రేమ చేతిని పట్టుకుని లాగుతూ ఉంటాడు. వెంటనే తన చేతిని వదిలించుకుని గదిలోకి వెళ్లి డోరు లాక్ చేస్తుంది ప్రేమ.
నీకున్నది ఒక్కటే దారి.. ఆలోచించుకో
డోర్ తీయ్యు అంటూ గది బయటే ఉంటాడు రాజపుష్పం. ” నేను బయటి రోడ్ లాక్ చేశాను. మరి నువ్వు లోపటి నుంచి ఎలా తప్పించుకుంటావు. చూడు నువ్వు బయటకు వెళ్లాలి అన్నా.. డ్యాన్స్ కాంపీటీషన్ లో పాల్గొని పది లక్షలు గెలవాలి అన్నా నేను నీకు చెప్పినట్లు వినడం ఒకటే దిక్కు. నీకు పది నిమిషాలు టైమ్ ఇస్తున్నా.. బాగా ఆలోచించుకుని మెంటల్ గా ప్రీపేర్ అవ్వు ” అంటాడు రాజపుష్పం. దీంతో గదిలోనే ఉండిపోతుంది ప్రేమ. మరోవైపు ఫుడ్ డెలివరీ తీసుకుని ఒక ఇంటికి వస్తాడు ధీరజ్. డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుంది ప్రేమ స్నేహితురాలు మధు. దీంతో షాకవుతాడు ధీరజ్.
ఇదేంటి నువ్వు ఇక్కడున్నావ్.. మీ అమ్మకి ఆరోగ్యం.. ? ధీరజ్‌కి దిమ్మతిరిగే షాక్
“మీ అమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చిందని.. సిటీలోని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని చెప్పి ప్రేమను తోడుగా తీసుకెళ్లావ్ కదా. మరీ నువ్వేంటీ ఇంట్లో ఉన్నావు” అని అడుగుతాడు ధీరజ్ అనుమానంగా. దీంతో మధు కంగారు పడుతూ ఉంటుంది. ” అది అది.. కొంచెం లేట్ అయ్యింది. అందుకే ఇప్పుడే బయలుదేరుతున్నాం” అంటూ టెన్షన్ పడుతూ చెబుతుంది మధు. ” మరీ అప్పుడెప్పుడో మా ఇంటి దగ్గరి నుంచి వచ్చేశారు కదా. ఇప్పుడు బయలుదేరడం ఏంటీ. పైగా మీ అమ్మకు హార్ట్ ఎటాక్ అని చెప్పావు. మరి హార్ట్ ఎటాక్ పేషెంట్ ను ఎవరైనా ఇంతా లేట్ గా తీసుకెళ్తారా.. ” అని అడుగుతాడు ధీరజ్. ” అది.. అమౌంట్ కొంచెం లేట్ అయిపోయింది అందుకే ” అంటుంది మధు కంగారుగా.
సారీ ధీరజ్.. ప్రేమ డాన్స్ కాంపిటేషన్‌కి వెళ్లింది..
“నీ మాటలు, నీ ప్రవర్తన, అన్నింటికి మించి.. మీ అమ్మకు బాగలేకపోతే నువ్వు కూల్ గా ఫుడ్ తెప్పించుకోవడం.. విషయం మీ అమ్మకు బాగలేకపోవడం కాదని.. ఇంకేదో ఉందని.. నువ్వు దాస్తున్నావని నాకు అర్థమైంది.. ఏంటా విషయం ” అని అడుగుతాడు ధీరజ్ కోపంగా. ” అయ్యో అలాంటిదేం లేదు ధీరజ్. నిజంగానే మా అమ్మకు బాగలేదు” అంటుంది మధు. ” ప్రేమ ఎక్కడ. నువ్వు ఇక్కడుంటే ప్రేమ ఎక్కడ. ప్రేమ కూడా నీతోపాటే ఉండాలి కదా. పిలువు, ప్రేమను పిలువు. చెప్తుంటే వినబడట్లేదా.. ప్రేమను పిలువు” అంటూ సీరియస్ అవుతాడు ధీరజ్. ” సారీ ధీరజ్. ప్రేమ డ్యాన్స్ కాంపీటీషన్ కు వెళ్లింది” అంటూ అసలు విషయం చెబుతుంది మధు. దీంతో ధీరజ్ షాకవుతాడు.
ధీరజ్.. ధీరజ్.. కాపాడూ!! రక్షించూ
“ఏంటీ డ్యాన్స్ కాంపీటీషన్ కు వెళ్లిందా.. అంటే తనను డ్యాన్స్ కాంపీటీషన్ కు పంపించడం కోసం మీ అమ్మకు బాగలేదని నాటకం ఆడావా ” అంటాడు ధీరజ్. ” ఇందులో నా తప్పేం లేదు ధీరజ్. ప్రేమే డ్యాన్స్ కాంపీటీషన్ కు వెళ్లడం కోసం నాతో ఇలా అబద్ధం చెప్పించింది” అంటుంది మధు. ” చెప్తాను ఉండు దాని సంగతి” అంటూ ప్రేమకు ఫోన్ చేస్తాడు ధీరజ్. కానీ ప్రేమ ఫోన్ రాజపుష్పం చేతిలో ఉంటుంది. ఫోన్ రింగ్ సౌండ్ రావడంతో.. ” ధీరజ్.. నా ఫోన్” అంటూ కంగారు పడుతూ కిటికీ వద్దకు వస్తుంది ప్రేమ. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు రాజపుష్పం. ” ప్రేమ ఎక్కడున్నావు నువ్వు ” అంటాడు ధీరజ్. ధీరజ్, ధీరజ్ అంటూ అరుస్తుంది ప్రేమ.
ఎక్కడున్నావ్ ప్రేమా.. ఫోన్‌ని మ్యూట్‌లో పెట్టిన దుర్మార్గుడు
“ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంటీ. ఎక్కడున్నావు నువ్వు” అంటాడు ధీరజ్. ” ధీరజ్.. నేను ప్రమాదంలో ఉన్నాను. వచ్చి నన్ను కాపాడు ధీరజ్ ” అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ప్రేమ. ” నువ్వు ఎంత అరిచినా.. దిక్కులు దద్దరిల్లినా గొంతు చించుకుని అరిచినా నీ మొగుడికి వినబడదుగా.. ఎందుకంటే నీ ఫోన్ నేను మ్యూట్ లో పెట్టాను” అంటూ నవ్వుతూ ఉంటాడు రాజపుష్పం. ప్రేమ షాకవుతుంది. ” నేను వద్దని చెప్పినా వినకుండా అబద్ధం చెప్పి మరీ డ్యాన్స్ కాంపీటీషన్ కు వెళ్లావు కదా. బుద్దుందా నీకు అసలు ” అంటూ అవతలి నుంచి కోప్పడుతుంటాడు ధీరజ్. ” ప్లీజ్ ప్లీజ్. అన్ మ్యూట్ చేయావా.. నేను మా ఆయనతో మాట్లాడాలి. ప్లీజ్ అన్ మ్యూట్ చేయ్ ప్లీజ్” అంటూ రాజపుష్పంను వేడుకుంటుంది ప్రేమ.
నీ మొగుడికి తెలిసేట్టు ఎందుకు చేస్తానే చిలకా..
“అబ్బా. కష్టపడి పట్టుకున్న చిలకను ఎవరైనా అంత తేలిగ్గా వదిలిపెడతారా. నీ మాటల్ని నీ మొగుడికి వినబడేలా చేసి వాడు ఇక్కడకు వచ్చేలా చేసి .. డిష్యూం డిష్యూం అని వాడి చేతిల్లో దెబ్బలు తిని నిన్ను వాడి చేతుల్లో పెట్టడానికి నేనేమైనా తింగరోడిని అనుకున్నావా” అంటాడు రాజపుష్పం. ” ప్లీజ్ అన్ మ్యూట్ చేయ్” అంటూ దండం పెడుతుంది ప్రేమ. ” ఏయ్.. నేను తిడుతున్నానని ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నావా..” అంటాడు ధీరజ్ ఫోన్ లో. ” ధీరజ్.. నేను ఎంత ఏడ్చినా నా మాటలు నీకు వినబడవురా” అంటూ ఏడుస్తుంది ప్రేమ. ” నీకు తెలివితేటలు బాగా ఎక్కువైపోయాయి.. ఇంటికి రా నీ కాళ్లు విరగొట్టకపోతే చూడు ” అంటూ ఫోన్ కట్ చేస్తాడు ధీరజ్.
ఏంటీ అబద్దం చెప్పి డాన్స్ కాంపిటేషన్‌కి వచ్చావా?? ‘నీకు దండం పెడతానూ వదిలెయ్’
మధుకు ఆర్డర్ ఇచ్చి కోపంగా వెళ్లిపోతాడు ధీరజ్. మరోవైపు ధీరజ్ ధీరజ్ అంటూ ఏడుస్తుంది ప్రేమ. ” నీ మొగుడికి నువ్వంటే బోలేడంత లవ్వు అనుకుంటా. అందుకే నువ్వు మాట్లాడట్లేదని అలిగి ఫోన్ పెట్టేశాడు. ” అయ్యయ్యో అదేంటీ ప్రేమ. ఇంట్లో అబద్ధం చెప్పి ఈ డ్యాన్స్ కాంపీటీషన్ కు వచ్చావా. అయ్యా పాపం. నాకోసం అంత రిస్క్ చేశావా. మరి నా దగ్గరకు రావడం మానేసి అలా గడియ పెట్టి లోపల దాక్కున్నావేంటమ్మా” అంటాడు రాజపుష్పం. ” మా ఆయనకు కారు కొనిచ్చి అతనికి ఇష్టమైన ట్రావెల్స్ పెట్టించాలి. అందుకే డ్యాన్స్ కాంపీటీషన్ కు వచ్చాను. నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్” అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ప్రేమ.
ఆ కోరిక తీరిస్తే.. ఆ పది లక్షలూ నీవే.. ఏమంటావ్??
” నీ అందం నన్ను చాలా డిస్ట్రర్బ్ చేసింది. అందుకే నిన్ను ఇక్కడకు రప్పించాను. నా బాధ నువ్వు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ ” అంటాడు రాజపుష్పం. ” మీకు దండం పెడతాను ప్లీజ్” అంటూ ఏడుస్తుంది ప్రేమ. “నీకు చెప్పాను కదా. ఆ పది లక్షల ప్రైజ్ మనీ నీకే ఇప్పిస్తా. అందుకే నీ అందంతో నన్ను మైమరపించు.. ఈ ఒక్కటే నీకు దారి” అంటూ బంగారు కోడిపెట్ట వచ్చేనండి అంటూ పాట పాడుతూ వెళ్లిపోతాడు రాజపుష్పం. దీంతో ప్రేమ గదిలోనే ఏడుస్తూ ఉంటుంది. మరి ధీరజ్ వచ్చాడా కాపాడాడా? రాజపుష్పం తాట తీశాడా అన్నది తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.



