
Gautam Gambhir – Agarkar! ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగిసింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Head Coach) సోషల్ మీడియా వేదికగా.. అగార్కర్ సేవలను కొనియాడుతూ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ఇప్పటికే బీసీసీఐ కొత్త సెలక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
‘‘డియర్.. అజిత్ (Ajit Agarkar) భాయ్.. మీతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు మీ దృఢమైన విశ్వాసానికి నిదర్శనం. ఎల్లవేళలా జట్టుకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని గౌరవిస్తుంది. జట్టు ఎంపిక సమయంలో ఎదురైన విమర్శలకూ భయపడలేదు. మీ భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని గంభీర్ (Gautam Gambhir) శుభాకాంక్షలు తెలిపారు.
అగార్కర్ స్థానంలో ఎవరు..? చీఫ్ సెలక్టర్‌గా ఓజాకు అవకాశమెంత..?


