Fact check: శనివారం బ్యాంకులకు సెలవు పేరిట గెజిట్‌.. నిజమెంత?


Fact check | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ బ్యాంకులకు శనివారం సెలవు (Holiday) పేరిట జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) సహా ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు దినంగా పేర్కొన్న ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాంటి నోటిఫికేషన్‌ ఏదీ జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ వెల్లడించింది.

నేపథ్యం ఇదీ..: వారానికి ఐదు రోజుల పనివిధానం సహా పలు డిమాండ్లపై బ్యాంక్‌ యూనియన్లు ఇటీవల సమ్మె తలపెట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ నెలలో ఒకరోజు సమ్మెకు దిగిన ఉద్యోగులు.. నెలాఖరులో మరో మూడు రోజుల పాటు సమ్మె తలపెట్టారు. అయితే, అది చివరి నిమిషంలో రద్దయ్యింది. ఈ నేపథ్యంలో అన్ని శనివారాలు సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది. దీంతో అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వలేదని కేంద్రం స్పష్టంచేసింది. ప్రస్తుతం బ్యాంకులకు ఆదివారాలతో పాటు 2, 4 శనివారాల సెలవు విధానం అమల్లో ఉంది.



Source link

Scroll to Top