
అమరావతి: ఏపీలో పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోంది. మంగళవారం రాత్రి 7 గంటల వరకు 90 శాతం పెట్రోల్ బంకుల్లో సాధారణ స్థితి నెలకొంది. ఇంధన సరఫరా మెరుగుపడటం, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉండటంలో బంకుల వద్ద రద్దీ తగ్గుముఖం పట్టింది. అర్ధరాత్రి నుంచి వంద శాతం పెట్రోల్, డీజిల్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. పెట్రోల్, డీజిల్ సమస్యపై సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడా బంకుల్లో నోస్టాక్ బోర్డు కనిపించకూడదని, ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


