Bigg Boss Contestant Divvala Madhuri: బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రోజురోజుకు షాకింగ్ ట్విస్ట్‌లతో ఉత్కంఠగా సాగుతోంది. అయితే ఈ ఎనిమిదవ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్‌ను వీడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఊహాగానాలు, లీకులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వారం బిగ్ బాస్‌కి వచ్చిన ఓటింగ్ ప్రకారం ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి లీస్ట్‌లో ఉందని.. దీంతో ఆమెని హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు.

1
/5
బిగ్ బాస్ తెలుగు ప్రారంభమై 8 వారాలు అవుతుంది. 15 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7న ఈ షో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం మాధురి, తనూజ, సంజనా, రీతూ చౌదరీ, గౌరవ్, కళ్యాణ్, పవన్, రాము రాథోడ్ నామినేషన్‌లో ఉన్నారు.

2
/5
ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం గౌరవ్ లీస్ట్‌లో ఉన్నాడు. దీంతో ఈ వారం గౌరవ్ ఎలిమినేషన్ పక్కా అని ఆడియన్స్ అనుకున్నారు. అతనితో పాటు దివ్వెల మాధురి కూడా ఓటింగ్‌లో లీస్ట్‌లోనే ఉంది. దీంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని.. అందులో గౌరవ్‌కే ఎక్కువ అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఇప్పుడు గౌరవ్ కాకుండా మాధురిని ఎలిమినేట్ చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు.

3
/5
బిగ్ బాస్‌కి వచ్చిన ఓటింగ్ ప్రకారం దివ్వెల మాధురి లాస్ట్‌లో ఉందని.. దీంతో ఆమెని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందట. మొత్తంగా ఈ వారం ఫైర్ బ్రాండ్ హౌజ్‌ని వీడినట్టు తెలుస్తోంది. అయితే మాధురి ఎలిమినేషన్‌పై.. అటు హౌస్‌మేట్స్, ఇటు ఆడియెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మాధురిని అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించారు.

4
/5
దివ్వెల మాధురిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉండదని.. ఆమె పెట్టుకునే గొడవలతో బిగ్ బాస్ హౌస్‌కి మంచి టీఆర్పీ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాధురిని హౌస్ నుంచి పంపించడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారంలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

5
/5
అయితే దివ్వెల మాధురి వచ్చిన మూడో వారమే హౌస్‌ని వీడాల్సి వచ్చింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన అయేషా జీనత్ కూడా అనారోగ్యంతో హౌస్‌ని వీడింది. వచ్చి రావడంతోనే వరుసగా ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం గమనార్హం. వీరే స్ట్రాంగ్ అండ్ క్రేజీ కంటెస్టెంట్లు అని అంతా భావించారు. కానీ వారే ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ ఆడియన్స్ షాకింగ్ అనే చెప్పాలి.


