Bellamkonda Sai Sreenivas: వివాహ బంధంలోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌


తెలుగు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేసి వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి వేడుక బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ గతేడాది ‘కిష్కింధపురి’ చిత్రంతో విజయాన్ని అందుకోగా.. ప్రస్తుతం ‘టైసన్‌ నాయుడు’, ‘హైందవ’ సినిమాల్లో నటిస్తున్నారు.



Source link

Scroll to Top