Amalapuram: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ టికెట్‌ రూ.1.11 లక్షలు


వేలంలో దక్కించుకున్న అభిమాని

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రం ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను మోకా సుబ్బారావు అనే అభిమాని రూ.1.11 లక్షలకు దక్కించుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీవెంకటరమణ థియేటర్‌ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో మంగళవారం వేలం నిర్వహించగా భాజపా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు దీన్ని అత్యధిక ధరకు పాడుకున్నారు. ఈ నగదును చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టుకు అందజేస్తామని అభిమాన సంఘం నాయకులు తెలిపారు.



Source link

Scroll to Top