
హైదరాబాద్: నటుడు అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నయనికతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో వీరి నిశ్చితార్థం (Allu Sirish Engagement) శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలతోపాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో విచ్చేసి సందడి చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజికమాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.





