త్వరలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశం

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 15 నుంచి 18 తేదీల మధ్య పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు సూచించింది. దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాయలసీమ, కోస్తాంధ్రలో కూడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.


