ఏపీలో 106 మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవులకు రిజర్వేషన్ల ఖరారు


అమరావతి, అక్టోబర్12: రాష్ట్రంలో మొత్తం106 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు. ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, ఒకటి మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 07 మహిళలకు కేటాయించింది.

బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్ పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో మొత్తం 26 చైర్ పర్సన్ స్థానాలు కేటాయించింది.

https://www.youtube.com/<a href="https://www.amazon.in/s?k=watch&tag=proffercoupon-21" rel="nofollow sponsored" class="amazon-affiliate-link" target="_blank">watch</a>?v=wrtqgMCGxaI

106 మున్సిపాలిటీల చైర్‌పర్సన్ రిజర్వేషన్లు (పురపాలక సంఘాలు, నగర పంచాయతీ‌ల రిజర్వేషన్ల జాబితా) వాటి పూర్తి వివరాలు..

ఎస్టీ:3

మహిళ(1): గూడూరు

జనరల్(2): ఆలూరు, ఆత్మకూరు

ఎస్సీ:14

మహిళలు(7): చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల.

జనరల్ (7): ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల.

బీసీ: 36

మహిళలు(18) చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం.

జనరల్(18): కావలి, కదిరి, బి. కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు.

జనరల్ మహిళ(27):

కనిగిరి, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు.

అన్‌ రిజర్వుడ్ (26):

సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడి పత్రి, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి.

null

ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడలో దసరా ఉత్సవాలు.. భద్రతను సమీక్షించిన హోం మంత్రి

బొల్లారం చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. డబ్బు కోసం సెక్యూరిటీ గార్డే..
Read Latest AP News And Telugu News

Updated Date – Oct 12 , 2026 | 05:58 PM



Source link

Scroll to Top