EMI Savings Calculator,రూ. 40 లక్షల హోం లోన్.. వడ్డీ ఒక శాతం తగ్గితే ఇలా రూ. 10 లక్షలకుపైనే ఆదా.. ఎన్నేళ్లకు ఎంత లాభమంటే? – rs 40 lakh home loan how much can you save if interest falls from 10 percent to 9 percent


Home Loan Interest Rates: ఆర్బీఐ ఇటీవల కీలక రెపో రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో హోం లోన్లు మరింత భారం అవుతాయి. అందుకే ఇక్కడ హోం లోన్లు తీసుకునే ముందు వడ్డీ రేట్లు సరిగా చూసుకోవాలి. వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉన్నా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఉదాహరణతో ఒక శాతం తక్కువ వడ్డీ రేటుకే లోన్ వస్తే ఎన్నేళ్లకు ఈఎంఐ ఎంత ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం.

Home Loan EMI Savings
హోం లోన్ ఈఎంఐ(ఫోటోలు– Samayam Telugu)
Home Loan EMI Savings Calculator : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు మూడేళ్ల తర్వాత కీలక రెపో రేట్లను ఇటీవల పెంచింది. 5.25 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. దీంతో ఇదివరకే ఫ్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ భారం పెరుగుతుంది. ఇదే సమయంలో కొత్తగా లోన్లు తీసుకునే వారికి కూడా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే చాలా వరకు ఇది హోం లోన్లపైనే ప్రభావం చూపుతుంది. సాధారణంగా హోం లోన్ అనేది దీర్ఘ కాల పరిమితితో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవరాల్‌గా వడ్డీనే ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ లోన్లు తీసుకునే ముందుగా వడ్డీ రేట్లను పోల్చుకోవడం ముఖ్యం. తక్కువ వడ్డీ రేటుతో లోన్ తీసుకోవడం గురించి ఆలోచించాలి. ఇక్కడ ఒకవేళ ఇదివరకే ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకున్న వారు, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న ఇతర బ్యాంకులకు కూడా లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనీసం వడ్డీ రేటు ఒక శాతం తగ్గినా కూడా లాంగ్ రన్‌లో పెద్ద మొత్తంలో ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. వడ్డీ ఆదా చేసుకోవచ్చు.

ఇప్పుడు మనం ఉదాహరణకు రూ. 40 లక్షల హోం లోన్, వడ్డీ రేట్లు, ఈఎంఐ లెక్కల గురించి తెలుసుకుందాం. రూ. 40 లక్షల హోం లోన్‌పై వడ్డీ రేటు 10 శాతం నుంచి ఒక శాతం తగ్గి 9 శాతానికి చేరితే, ఇక్కడ లోన్ కాల పరిమితిని బట్టి కనీసం రూ. 2.63 లక్షల నుంచి రూ. 10.50 లక్షల వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ 10, 20, 30 ఏళ్ల కాల పరిమితుల్లో ఈఎంఐ ఎంత తగ్గుతుంది?, మొత్తం వడ్డీ ఎంత మిగులుతుందో చూద్దాం.