Nepal Flash Floods: బురదతో నిండిన సొరంగం.. 350 మంది రెస్క్యూ..


ఇంటర్నెట్‌ డెస్క్‌: నేపాల్‌లో సంభవించిన విపత్తులో (Nepal floods) ఆచూకీ గల్లంతైన వారికోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిశూలి 3ఏ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్‌ సైన్యం కాపాడింది. వీరిలో 63 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, వేగంగా ప్రవహిస్తోన్న వరద, ప్రమాదకరమైన, సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ.. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమైనట్లు తెలిపింది. అందులో చిక్కుకుపోయిన మరో 100 మందిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.

వరదల్లో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని లాగి.. బంగారం దొంగిలించి..!

వరదల్లో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు, మృత దేహాల వెలికితీత విషయంలో జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో నేపాల్‌ సైన్యం రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేసింది. మరిన్ని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి మృతదేహాలను వేగంగా వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రసువా నుంచి చిత్వాన్‌ వరకు నదీ మార్గంలోనే 1200 మంది సైనికులను మోహరించినట్లు తెలిపింది. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ కోసం 2800 మంది సైనికులు క్షేత్రస్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది.



Source link

Scroll to Top