Petrol-Diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు


ఇంటర్నెట్‌డెస్క్‌: వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మళ్లీ పెంచింది (Petrol-Diesel prices hiked). లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు ధరలు పెరగడం గమనార్హం. 

పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచాయి. మరోవైపు ధరల నియంత్రణ కోసం కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం వసూలును కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే మరోసారి ధరలు పెంచడం గమనార్హం. 

  • పెట్రోల్‌ ధరలు: దిల్లీలో రూ.98.64 (+0.87), కోల్‌కతాలో రూ.109.70 (+0.96), ముంబయి రూ.107.59 (+0.91), చెన్నై రూ.104.49 (+0.82)గా ఉండనున్నాయి.
  • డీజిల్‌ ధరలు: దిల్లీలో రూ.91.58 (+0.91), కోల్‌కతాలో రూ.96.07 (+0.94), ముంబయి రూ.94.08 (+0.94), చెన్నై రూ.96.11 (+0.86)గా ఉండనున్నాయి.
  • ఇక, తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.88కు చేరగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.95కి పెరిగాయి.



Source link

Scroll to Top