Nbk 112 May 1st Launch,కొరటాల-బాలకృష్ణ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే! – nandamuri balakrishna joins hands with koratala siva grand launch on may 1st


నందమూరి బాలకృష్ణ పేరు వింటేనే థియేటర్లలో పూనకాలు మొదలవుతాయి. అరవై ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు సవాల్ విసురుతూ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాను పట్టాలెక్కించిన బాలయ్య… తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తన తదుపరి చిత్రం కోసం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఆయన చేతులు కలుపుతున్నారు.

* బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ కలెక్షన్ల సునామీ… రీ రిలీజ్‌లోనూ ప్రభాస్ రికార్డుల వేట!

ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే.. మే 1వ తేదీన ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. గోపీచంద్ మలినేని సినిమా సెట్స్‌పై ఉండగానే, బాలయ్య ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కొరటాల ప్రాజెక్టును లైన్‌లో పెట్టడం విశేషం. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.

* ‘ఉస్తాద్’పై పరుచూరి పంచ్‌లు.. పవన్ సినిమా ఎక్కడ తప్పటడుగు వేసిందంటే?

రచయితగా ‘భద్ర’, ‘సింహా’ వంటి చిత్రాలకు పనిచేసిన అనుభవం, దర్శకుడిగా ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, వంటి వరుస ₹100 కోట్ల క్లబ్ సినిమాల రికార్డు కొరటాల శివ సొంతం. ‘దేవర: పార్ట్ 1’తో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఆయన హీరో పాత్రలను అత్యంత పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేస్తూనే సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తారు. ఇప్పుడు బాలయ్య మార్క్ ఊరమాస్ యాక్షన్‌కు, కొరటాల శైలి మేకింగ్ తోడైతే వెండితెరపై రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వివేక్ ఆత్రేయ వంటి యువ దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి బాలయ్య కొరటాల శివ చెప్పిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌కే మొగ్గు చూపారు.

* శ్రీలీల బాలీవుడ్ కలలకు బ్రేక్?… షాకింగ్ విషయం చెప్పిన డైరెక్టర్ అనురాగ్ బసు

ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ ప్రారంభించడానికి ముందు దొరికిన గ్యాప్‌లో ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్నది చిత్ర బృందం లక్ష్యం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా సీనియర్ నటి ప్రియమణిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి గతంలో ‘మిత్రుడు’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. ఇక బాలయ్య మార్క్ సంక్రాంతి సెంటిమెంట్ ఈసారి కొరటాల డైరెక్షన్‌లో మళ్ళీ రిపీట్ అవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మెగా కొలాబరేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

వీరేష్ బిళ్ళ

రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్‌ స్టైల్ కథనాలు రాశారు. ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతో పాటు వీడియో టీమ్ కోసం పని చేసిన అనుభవం కూడా ఉంది. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. వీరేశ్ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. గతంలో ఈనాడు.నెట్‌లో 7 ఏళ్లు పనిచేసిన ఆయన సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఆరేళ్లు సేవలందించారు. ప్రస్తుతం ‘సమయం తెలుగు’లోనే కన్సల్టెంట్‌‌గా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో ప్రకృతిలో సేద దీరడం, పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు.… ఇంకా చదవండి



Source link

Scroll to Top