స్టార్ హీరో కుమారుడితో పెళ్లి.. హీరోయిన్ మదర్ రియాక్షన్..! | Kalyani Priyadarshan and Pranav Mohanlal are Going To married


Kalyani Priyadarshan and Pranav Mohanlal are Going To married

కొత్త లోకా మూవీతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఈ కోలీవుడ్‌ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. అంతేకాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించిన ముద్దుగుమ్మ.. 2022లో వచ్చిన ‘హృదయం’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్‌ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు భార్యా, భర్తలుగా మెప్పించారు. తెరపై వీరద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.

దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మదర్ లిస్సీ ప్రియదర్శన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.

సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హీరోయిన్ కల్యాణి మదర్ లిస్సీ ప్రియదర్శన్ రిప్లై ఇచ్చింది. కళ్యాణి, ప్రణవ్‌ పెళ్లి కోసం వెయిటింగ్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. అది తప్పుడు వార్త అంటూ లిస్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్, డేటింగ్‌ లాంటి రిలేషన్స్‌ లేవని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కళ్యాణి ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో లేదని లిస్సీ తేల్చి చెప్పంది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వీరిద్దరి వెడ్డింగ్ రూమర్స్‌కు తెరపడింది.

k
 



Source link

Scroll to Top