
సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్లో వందే భారత్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. సీ4 కోచ్‌లో మంటలు వ్యాపించగా దట్టంగా పొగ అలుముకుంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు భయాదోళనలకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు.
తక్షణమే రైల్వే సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రమాదం జరగడానికి కారణాలు విద్యుత్ షార్ట్ సర్క్యూటా? మరో కారణమా? అన్నదానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ‘అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు’


