ABN
, Publish Date – Jun 01 , 2026 | 06:46 AM
ఈ ఏడాది సీజన్ ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గుజరాత్ టైటాన్స్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అలానే ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది ఆర్సీబీ.

RCB IPL 2026
స్పోర్ట్ డెస్క్: ఐపీఎల్ కప్‌ను ముద్దాడటమే గగనంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. వరుసగా రెండు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఆర్సీబీ.. ఈ ఏడాది కూడా కప్‌ను ఎగరేసుకుని పోయింది. ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో జీటీ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా బెంగళూరు జట్టు స్కోర్ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్ దాటింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్లో ఇదే గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే 24 బంతుల్లో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సీఎస్కే రికార్డును రజత్ పాటిదార్ సేన బ్రేక్ చేసింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 5 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లి కేవలం 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీతో పాటు వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులతో రాణించాడు. తనదైన బ్యాటింగ్‌తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కింగ్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్
ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..
Updated Date – Jun 01 , 2026 | 06:53 AM


