
డస్కాటే
దిల్లీ: టీమ్‌ఇండియా సహాయ కోచ్ పదవి నుంచి ర్యాన్ టెన్ డస్కాటే తప్పుకోనున్నట్లు సమాచారం. ఈ నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్ రెండేళ్ల ముందు బాధ్యతలందుకున్నాడు. అప్పట్నుంచి సహాయ కోచ్‌గా ఉన్నాడే తప్ప అతడికి నిర్దేశిత బాధ్యతలు లేవు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. సితాంశు కోటక్ బ్యాటింగ్, మోర్నీ మోర్కెల్ బౌలింగ్ సహాయ కోచ్‌లుగా ఉన్నారు. ఇటీవల సాయిరాజ్ బహుతులే స్పిన్ సహాయ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు తనతో కలిసి పని చేసిన డస్కాటేను గంభీర్ ఫీల్డింగ్ కోచ్‌గా నియమిస్తానన్న హామీతో టీమ్‌ఇండియాలోకి తీసుకొచ్చినట్లు సమాచారం. కానీ అతను నిర్దేశిత బాధ్యతలు లేకుండానే రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించి ఇంకో ఏడాది కొనసాగించడానికి బీసీసీఐ సుముఖంగానే ఉన్నప్పటికీ.. డస్కాటే మాత్రం టీమ్‌ఇండియాను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోచింగ్ బృందంలో అతను భాగం కానున్నట్లు సమాచారం.


