
- కింగ్ అక్కినేని నాగార్జున 100వ చిత్రానికి టైటిల్ ఖరారు
- ‘కింగ్ 100’ పేరుతో వస్తున్న సినిమా గ్లింప్స్ విడుదల
- విడుదలైన కొన్ని గంటల్లోనే 8 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్
- రా. కార్తీక్ దర్శకత్వంలో ప్రాజెక్ట్
- 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల
‘The REIGN continues to grow. The KING continues to rule’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ గ్లింప్స్‌లో నాగార్జున అత్యంత స్టైలిష్, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. భారీ యాక్షన్ సన్నివేశాల మధ్య, ఆయన పాత్ర స్థాయిని తెలిపే నేపథ్య సంగీతం గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘లాంగ్ లివ్ ది కింగ్’ అంటూ ముగిసిన ఈ వీడియో, నాగార్జున కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమనే నమ్మకాన్ని కలిగిస్తోంది.
‘కింగ్ 100’ చిత్రాన్ని విలక్షణ తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తుండటం విశేషం. ఇందులో టబు కూడా నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి రెట్టింపు అయ్యింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సౌత్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నాగార్జునకు 100వ చిత్రం కావడం, దానికి అభిమానులు ఇష్టపడే ‘కింగ్100’ టైటిల్ పెట్టడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. గ్లింప్స్‌కే ఈ స్థాయిలో స్పందన రావడంతో, సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
https://www.youtube.com/<a href="https://www.amazon.in/s?k=watch&tag=proffercoupon-21" rel="nofollow sponsored" class="amazon-affiliate-link" target="_blank">watch</a>?v=OgF4eRYcHd8


